ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, ఆగస్టు 27: అంతర్జాతీయ హాస్పిటాలిటీ రంగంలో ప్రాక్టికల్ అనుభవంతో పాటు గ్లోబల్ ఎక్స్‌పోజర్‌ను అందించాలనే లక్ష్యంతో "IIHAM Hotel Management College" విద్యార్థులు థాయిలాండ్‌కు ఇంటర్న్‌షిప్ కోసం బయలుదేరుతున్నారు.
ఇప్పటికే IIHAMకు చెందిన పలువురు విద్యార్థులు థాయిలాండ్, మలేషియా దేశాల్లో హాస్పిటాలిటీ రంగంలో పనిచేస్తున్నారు. తాజాగా మరికొంత మంది విద్యార్థులు థాయిలాండ్‌కు వెళ్లడం ద్వారా అంతర్జాతీయ కెరీర్ వైపు మరో కీలక అడుగు వేస్తున్నారు.
థాయిలాండ్‌లోని IIHAM అనుబంధ విద్యా సంస్థలో విద్యార్థులకు మొదటి నెలలో థాయ్ భాష, సంస్కృతిపై ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఈ శిక్షణ పూర్తయిన అనంతరం విద్యార్థులు హాస్పిటాలిటీ పరిశ్రమలో తమ ఇంటర్న్‌షిప్‌ను ప్రారంభిస్తారు.
ఈ సందర్భంగా IIHAM వ్యవస్థాపకులు, చైర్మన్ వెంకట్ కిషోర్ చిక్కాల మాట్లాడుతూ.. విద్యార్థులను నేరుగా విదేశాలకు పంపించడం మాత్రమే తమ ఉద్దేశం కాదని తెలిపారు. వారు వెళ్లే దేశంలోని భాష, సంస్కృతి, పని వాతావరణంపై పూర్తి అవగాహన కల్పించిన తర్వాతే పరిశ్రమలో ప్రాక్టికల్ అనుభవం పొందేలా ప్రత్యేక శిక్షణా విధానాన్ని రూపొందించినట్లు వివరించారు.
థాయ్ భాష, సంస్కృతిపై ఒక నెల శిక్షణ అనంతరం విద్యార్థులు హాస్పిటాలిటీ పరిశ్రమలో ఇంటర్న్‌షిప్ ప్రారంభిస్తారని చెప్పారు. తద్వారా వారికి అంతర్జాతీయ పని వాతావరణాన్ని అర్థం చేసుకోవడంతో పాటు కస్టమర్ సర్వీస్, ప్రొఫెషనల్ డిసిప్లిన్, హోటల్ ఆపరేషన్స్ వంటి అంశాల్లో ప్రత్యక్ష అనుభవం లభిస్తుందని తెలిపారు.
విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు అంతర్జాతీయ అనుభవాన్ని సంపాదించుకోవడం ద్వారా భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న హాస్పిటాలిటీ కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకునేలా IIHAM నిరంతరం కృషి చేస్తుందని వెంకట్ కిషోర్ చిక్కాల పేర్కొన్నారు.
థాయిలాండ్‌కు బయలుదేరుతున్న విద్యార్థులకు IIHAM యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.



