డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, కే గంగవరం బ్యూరో: మండలంలోని దంగేరు గ్రామంలో 12 సంఘాల నూతన కార్యవర్గం ఎన్నిక గ్రామ సర్పంచ్ కొప్పిశెట్టి వీర వెంకటరమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి కొరకు అందరు సమిష్టిగా పని చేయాలని, ఎవరికి ఏ సమస్య వచ్చినా నూతన కార్యవర్గం అందుబాటులో ఉండి సమస్యను పరిష్కరించే దిశగా పనిచేయాలని ఆయన సూచించారు.
ఈ సంఘంలో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత కల్పించామని తెలియజేశారు. గ్రామ సర్పంచ్ కొప్పిశెట్టి వీర వెంకటరమణ సంఘ గౌరవ అధ్యక్షులు, కుక్కల శ్రీనివాసు ప్రెసిడెంట్, వడ్లపట్టి రాజశేఖర్ వైస్ ప్రెసిడెంట్, దొరబాబు సెక్రటరీ, పెట్టా వెంకటరమణ వాసంశెట్టి శ్రీనివాసు పంపన వెంకటేశ్వర్లు రచ్చ వీర్రాజు చిట్టూరి భద్రం కొమ్మన దుర్గాప్రసాద్ తదితరులు సభ్యులుగా ఎన్నికయ్యారు.