Hot Posts

6/recent/ticker-posts

ఏపీ సీనియర్ IPS అధికారి PSR ఆంజనేయులు అరెస్ట్.. విజయవాడకు తరలింపు


VIJAYAWADA: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్ట్‌ అయ్యారు. ముంబై నటి కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ను హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. బేగంపేటలోని నివాసంలో అదుపులోకి తీసుకుని పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. జగన్‌ హయాంలో పీ సీతారామాంజనేయులు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు సస్పెన్షన్‌లో ఉన్నారు.


విజయవాడలో ముంబై సినీ నటిపైపై గతేడాది కేసు నమోదైంది. వైఎస్సార్‌సీపీ నేత విద్యాసాగర్‌పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేయడానికే తనపై ఈ కేసు పెట్టారని నటి ఆరోపించారు. ఆ సమయంలో పీఎస్సార్ ఆంజనేయులు ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారు.. విజయవాడ సీపీగా కాంతిరాణా, డీసీపీగా విశాల్ గున్నీ పనిచేసే సమయంలో ఈ ఘటన జరిగింది. వైఎస్సార్‌సీపీ నేత విద్యాసాగర్ ఫిర్యాదుతో నటితో పాటుగా ఆమె తల్లిదండ్రులు, సోదరుడిపై కూడా కేసు నమోదు చేశారు. 

గతేడాది ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిబ్రవరి 3న ముంబైలో నటితో పాటుగా, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తీసుకువచ్చారు. ఆమెపై నమోదు చేసిన కేసు గురించి పోలీసులు ఎవరికీ చెప్పలేదు. ఈ విషయం 2024 ఆగస్టు 26న బయటపడింది. ఆ తర్వాత ముంబై నటి విజయవాడ వచ్చి విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబును కలిసి ఫిర్యాదు చేశారు.

ముంబై నటి ఫిర్యాదు తర్వాత ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణలను సస్పెండ్ చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో వైఎస్సార్‌సీపీ నేత విద్యాసాగర్, ఐపీఎస్ అధికారులపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ రెండు కేసులను సీఐడీకి బదిలీ చేశారు. 

అలాగే ఐపీఎస్ అధికారుల్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం సీఐడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. అయితే ఇటీవల ముంబై నటి విజయవాడకు వచ్చారు.. తన కేసు విచారణను వేగవంతం చేయాలని కోరారు.. ఈ క్రమంలో సీఐడీ అధికారులు సీనియర్ ఐపీఎస్ పీ సీతారామాంజనేయుల్ని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.
WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now