Hot Posts

6/recent/ticker-posts

జూన్ 2వ తేదీన చింతలపూడిలో ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం నిర్వహణ


చింతలపూడి మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..

జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

ఏలూరు/చింతలపూడి: జూన్ 2వ తేదీన సోమవారం చింతలపూడిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని చింతలపూడిలోని యం ఆరో వో కార్యాలయంలో   ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలన్నారు. ప్రజలు పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలనికోరారు. 

ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో  కూడా యధావిధిగా సంబంధిత అధికారులతో  గ్రీవెన్స్ స్వీకరణ నిర్వహించబడుతుందన్నారు. అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి దానికి సంబంధించి సమాచారం ఏమన్నా తెలుసుకోవాలి అన్నప్పుడు 1100  నేరుగా కాల్ చేయవచ్చని సూచించారు.

జూన్ 2వ తేదీ నుంచి జూన్ 6 వరకు యోగా పై మండల స్థాయిలో పోటీలు: జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

ఏలూరు: యోగా ద్వారా ఐక్యత - వారధి పేరిట జూన్ 2వ తేదీ నుంచి జూన్ 6వ  తేదీ వరకు మండల స్థాయిలో యోగ పై పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. జూన్ 2వ తేదీన జూనియర్ విభాగం(10_18 వయస్సు) సోలో యోగా ఆసనాలు, సూర్య నమస్కారం, ప్రాణామాయం, మెడిటేషన్ లలో ఉ.7:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోటీలు నిర్వహిస్తారన్నారు.

జూన్ 3వ తేదీన యువజన విభాగంలో (19-35 వయస్సు), సీనియర్ విభాగంలో 35 సంవత్సరాలు వయస్సు పైబడిన వారికి సోలో యోగఆసనాలు, సూర్య నమస్కారం, ప్రాణామాయం మెడిటేషన్ లలో ఉ.7:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోటీలు నిర్వహిస్తారన్నారు. జూన్ 4వ తేదీ జూనియర్ యంగ్, సీనియర్ విభాగాల్లో యోగ సాంగ్, యోగ పెయింటింగ్ ,యోగ పై స్కిట్ ,రోల్ ప్లే పోటీలు నిర్వహించబడతాయన్నారు

జూన్ 6వ తేదీ జూనియర్ యంగ్ ,సీనియర్ విభాగాల్లో క్విజ్,పోస్టర్, స్లోగన్ ,వ్యాసరచన షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ అంశాలపై పోటీలు నిర్వహించబడతాయన్నారు. మండల స్థాయిలో విజేతలకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించబడతాయన్నారు.