తాజా వార్తలు

10/recent/ticker-posts

వివాహ వేడుకలో పాల్గొని వధూవరులకు ఆశీర్వాదం – ఎమ్మెల్యే బాలరాజు


పోలవరం, పశ్చిమ వాహిని, మే 01: పోలవరం మండలంలోని ఎల్‌.ఎన్‌.డి పేట గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముప్పిడి అబ్బులు, రుతమ్మ దంపతుల కుమారుడు నరేష్ వివాహం శుక్రవారం ఘనంగా నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేష్ మరియు వధువును ఆశీర్వదిస్తూ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి శుభకార్యాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

ఈ వివాహ వేడుకల్లో జనసేన పార్టీ మండల అధ్యక్షులు గునపర్తి చిన్ని, మండల ఉపాధ్యక్షులు తెలగం శెట్టి రాంప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి చీకట్ల సాయి కృష్ణమూర్తి, మామిడిపల్లి వరప్రసాద్, మహిళా నాయకురాలు సిగిలి సీత, తేలే నరసింహమూర్తి, చిక్కాల సీతారాం బాబు, టీడీపీ నాయకులు గుబ్బా రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకులు, స్థానిక ప్రముఖులు కూడా హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.