కేపీ చౌదరి కాల్ లిస్ట్‌ని డీకోడ్ చేసిన పోలీసులు.. కేపీ చౌదరి-అషురెడ్డిల మధ్య వందల ఫోన్ కాల్స్ జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తం చేశారు. అషురెడ్డి మాత్రమే కాకుండా.. ఐటంసాంగ్స్‌కి ఫేమస్ అయిన మరో నటి, అలాగే టాలీవుడ్‌కి చెందిన కొందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల పేర్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా కొందరు రాజకీయ నేతల కుమారులు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఈ ఫోన్ కాల్స్‌పై విచారణ జరపగా.. కేపీ చౌదరి నోరు మెదపలేదని తెలుస్తోంది. విచారణలో 12 మందికి డ్రగ్స్ సప్లయ్ చేసినట్లుగా కేపీ చౌదరి అంగీకరించారని, అందులో బడా బాబుల పేర్లు, పలువురు యువతులు ఉన్నట్లుగా సమాచారం. కాల్ లిస్ట్ మాత్రమే కాకుండా.. కేపీ చౌదరి బ్యాంక్ లావాదేవీలను సైతం పరిశీలించిన పోలీసులకు.. ఆయన అకౌంట్స్‌లో భారీగా నగదు ట్రాన్సెక్షన్స్ జరిగినట్లుగా గుర్తించారని తెలుస్తోంది.
ఇక ఈ విచారణలో ప్రముఖంగా వినిపిస్తున్న అషు రెడ్డి విషయానికి వస్తే.. ఆమె ఈ మధ్య ఏ విధంగా పాపులర్ అయిందో తెలియంది కాదు. జూనియర్ సమంతగా పేరున్న అషు రెడ్డి.. బిగ్‌బాస్ తెలుగులో కంటెస్టెంట్‌గా.. ఆ తర్వాత సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన కొన్ని వీడియోల ద్వారా మరింతగా ఫేమస్ అయింది. ఇన్‌స్టాగ్రమ్‌లో ఆమెకు 2 మిలియన్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆమెకు సినిమా అవకాశాలు లేకపోయినా.. విదేశాలలో షికార్లు చేస్తూ లగ్జరీ లైఫ్‌ని కొనసాగిస్తుంటుంది. ఇప్పుడామె పేరు బయటికి రావడంతో.. ఆమె లగ్జరీ లైఫ్‌కి కారణం ఇదేనంటూ అప్పుడే కామెంట్స్ కూడా మొదలయ్యాయి.
కేపీ చౌదరి గురించి చెప్పుకుంటే.. రజనీకాంత్ నటించిన కబాలి(తమిళం) చిత్రాన్ని కేపీ చౌదరి నిర్మాతగా తెలుగులో డబ్ చేశారు. సర్దార్ గబ్బర్‌సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సరిమల్లె చెట్టు వంటి చిత్రాలకు కేపీ చౌదరి డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. సినీ రంగంలో భారీ నష్టాలను చవిచూసి.. గోవాకు మకాం మార్చారు. అక్కడ ఓహెచ్‌ఎం అనే క్లబ్‌ను నిర్వహిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారికి గోవాలో వసతి కల్పించేవారు. క్లబ్ వ్యాపారంలోనూ నష్టాలు రావడంతో.. డ్రగ్స్ దందాకు తెరతీశారు.
ఈ మార్కెట్ లో ఎన్నో ఓటిటి ప్లాట్ ఫామ్స్ వచ్చాయి.. అవి అన్ని నెలనెలా పెమేంట్ చేయాలి.. మన BCN OTT ఫ్లాట్ ఫాం పూర్తిగా ఉచితం... మీరు ఇంట్లో మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ సెల్ ఫోన్ లో అన్ని చానల్స్, రెడియో ఎఫ్ ఎం, న్యూస్ పేపర్, మూవీస్స్ చూడవచ్చును.