Hot Posts

6/recent/ticker-posts

బనకచర్ల ప్రాజెక్ట్‌ రాష్ట్ర పునర్విభజన చట్టానికి వ్యతిరేకం: మంత్రి ఉత్తమ్‌


HYDERABAD:తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రితో చర్చించారు. ప్రాజెక్టు రాష్ట్ర పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని తెలిపారు. కేంద్రం తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఏపీకి 1500 టీఎంసీల నీటిని అందించే ప్రతిపాదన చర్చనీయాంశంగా మారింది.

గోదావరి బనకచర్లపై తమ అభ్యంతరాలను తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రికి వివరించామన్నారు. సీఎం రేవంత్‌తో కలిసి కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమన్నారు. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని.. త్వరలోనే ఇరు రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారని తెలిపారు.

మరోవైపు గోదావరి, కృష్ణాల్లో 1500 టీఎంసీలు వినియోగించుకునేలా ఏపీ ఎన్‌వోసీ ఇవ్వాలంటున్న తెలంగాణ ప్రభుత్వం ఆఫర్ వెనుక అనేక చిక్కులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అంశాన్ని నాలుగైదు రాష్ట్రాలకు ముడిపెట్టేలా తెలంగాణ ప్రతిపాదనలు చేసినట్టు ప్రచారం సాగుతోంది. ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్ నుంచి కృష్ణా నదిలోకి గోదావరి నీళ్లు మళ్లించే అంశంపై ఏపీతో చర్చలకు సిద్ధమని తెలంగాణ అంటోంది. అయితే ఇచ్చంపల్లి నుంచి వరద జలాలను మళ్లించడంపై ఛత్తీస్‌గఢ్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వరద జలాల్లో తమ వాటా 147 టీఎంసీలు ఇచ్చేదే లేదని ఛత్తీస్‌గఢ్ చెబుతోంది. దీంతో ఏపీకి తెలంగాణ ఇచ్చిన ఆఫర్‌పై ఏపీ, తెలంగాణ కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మధ్య చర్చలు జరగాల్సిన పరిస్థితిలు నెలకొన్నాయి.