ఏలూరు జిల్లా కుక్కునూరు: ఇబ్రహీంపేట గ్రామంలో ఈ నెల 17వ తేదిన ఇల్లులు కాలిపోయిన భాదితులకు వైసీపీ మండల పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అద్యక్షులు కుచ్చర్లపాటి నర్సింహారాజు చేతులు మీదగా 15 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలలో శనివారం రోజు కరెంట్ షార్ట్ షర్క్యూట్ వలన నాలుగు ఇల్లులు పూర్తిగా దగ్ధం అయ్యాయి అని కాలిపోయే సమయానికి ఇంట్లో వాళ్ళు ఎవరు లేకపోవటం ఇంట్లో వున్నా సామాన్లు, మరియు బట్టలు, బంగారం, ధాన్యం, అన్ని సర్వం కోల్పోయి అగ్నికి ఆహుతి అయ్యి వీధిన పడ్డారు అని అందుకే వారి ఆర్ధిక పరిస్థిని దృష్టిలో వుంచుకొని ఈరోజు వారి కుటుంభాలను పరమర్శించి వారికి పదిహేను వేల రూపాయల ఆర్ధిక సహాయం మండల పార్టీ ఆధ్వర్యంలో అందించడం జరుగుతుందని తెలిపారు.
అలాగే వారికీ పార్టీ అన్నివిధాలుగా అండగా ఉంటుంది అని భరోసా కల్పించి వచ్చారు.