Hot Posts

6/recent/ticker-posts

అమ్మ ఒడి పథకం ద్వారా 259.43 కోట్లు జమ..

ఏలూరు జిల్లా ఏలూరు: జగనన్న అమ్మఒడి పధకం 4వ విడత క్రింద 2022-23 సంవత్సరానికి జిల్లాలో 1,72,956 మంది తల్లుల ఖాతాలకు 259.43 కోట్లు ఆర్థిక సహాయం జమ చేయడం జరిగిందని జిల్లాజాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ వద్ద గోదావరి సమావేశ మందిరంలో జగనన్న అమ్మఒడి పధకం నాలుగవ విడత ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంట పద్మశ్రీ, జిల్లా రెవెన్యూ అధికారి ఏవి ఎన్ ఎస్ మూర్తి,  జిల్లా విద్యాశాఖ అధికారి రవి సాగర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అలాగే రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జన్మోహన్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పాల్గొన్న రాష్ట్ర స్థాయి అమ్మఒడి సహాయ పంపిణీ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. ముఖ్యమంత్రి సందేశాన్ని తిలకించారు.  అనంతరం  అమ్మ ఒడి 4వ విడత కార్యక్రమం క్రింద జిల్లాలో అర్హత కలిగిన 1,72,956 మంది తల్లుల ఖాతాలకు ముఖ్యమంత్రి బటన్ నొక్కడం ద్వారా జమ చేసిన 259.43 కోట్లు మొత్తానికి నమూనా చెక్కును విద్యార్థుల తల్లుల బృందానికి అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి మాట్లాడుతూ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్య పరంగా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలకు 15 వేలు ప్రభుత్వపరంగా ప్రోత్సాహం కింద ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దీని ద్వారా గతంలో పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు  సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. పేద కుటుంబంలోని పిల్లలు విద్యకు దూరం కాకుడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. చదువు అనంతరం ఉద్యోగంలో అవసరమైన నైపుణ్యాన్ని పెంపొదించడానికి అవసరమైన కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

సాంకేతిపరమైన విజ్ఞానం సంపాదించడానికి ఇంగ్లీష్ మీడియంలో పాఠశాలను నడిపిస్తున్నారని, అలాగే ట్యాబ్ లు ద్వారా విద్యార్థులకు బైజూస్ లెర్నింగ్ యాప్ లో మరింత లోతుగా పాఠాన్ని అధ్యయనం చేయవచ్చు అన్నారు. చదువే పిల్లలకు మనం ఇచ్చే విలువైన సంపదని, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపి చదివించడం ద్వారా బంగారు భవితను అందించాలని కోరారు.  పేదరికం వల్ల ఏ తల్లీ తన బిడ్డలను చదివించలేని పరిస్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం గడచిన మూడు సంవత్సరాలుగా అమ్మఒడి పధకం ద్వారా ఏటా 15 వేల రూపాయల ఆర్థిక సహాయం నేరుగా పేద విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేస్తోందన్నారు. జిల్లాలో తొలి సంవత్సరం 2019-20లో 3,39,259 మంది తల్లులకు 508.89 కోట్లు, 2020-21 సంవత్సరంలో 3,55,051 మంది తల్లులకు 532.57 కోట్లు  మూడవ విడతగా 2021-22 సంవత్సరానికి 1,84,239 మంది తల్లుల ఖాతాకు 276.36 కోట్లు జమ చేసారని తెలిపారు. 4వ విడత కింద 2022-23 విద్యా సంవత్సరానికి  1,72,956 మంది తల్లుల ఖాతాకు 259.43 కోట్లు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు.  

4వ విడత అమ్మ ఒడి పథకం కింద జిల్లాలోని నియోజకవర్గాల వారిగా చింతలపూడి నియోజకవర్గంలో 29,594మంది తల్లుల ఖాతాలకు 44.39 కోట్లు, దెందులూరు నియోజకవర్గంలో 30,474 మందికి 45.71కోట్లు, కైకలూరు నియోజకవర్గంలో 20,452 లబ్ధిదారులకు 30.68 కోట్లు, పోలవరం నియోజకవర్గంలో 30,434మందికి 45.65 కోట్లు, ఉంగుటూరు నియోజవర్గంలో 16,265 మందికి 24.40 కోట్లు, ద్వారకాతిరుమలలో  6,858 మందికి 10.29 కోట్లు, నూజివీడు నియోజకవర్గంలో 26,276 మందికి 39.41 కోట్లు తల్లుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఇష్టంగా చదువుకునే అనుకూల పరిస్థితులు కల్పిస్తూ మన బడి-నాడు నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక కిట్లు,  విద్యార్థులను విద్యలో ప్రోత్సహించడం కోసం ఆణిముత్యాలు  తదితర కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.  

రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని పేద విద్యార్థులు చదువులో రాణించాలని ఆకాక్షించారు.  తల్లిదండ్రులు వారి పిల్లలకు చదువు ద్వారా మంచి భవిష్యత్తు కల్పించాలని జాయింట్ కలెక్టర్ కోరారు.

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడూతు నాలుగవ విడత  అమ్మ ఒడి పథకం కింద ప్రతి తల్లి ఖాతాలకు 15 వేలు వారి వారి ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని, ఈ సొమ్మును పిల్లల విద్యకు మాత్రమే ఖర్చు చేయాలని అన్నారు. ఈరోజు ఒక పండుగ రోజుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకమని తెలిపారు. పేద పిల్లల చదువుల ద్వారా వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రివర్యులు విద్యా రంగ పరంగా అనేక కార్యక్రమాలు చేపట్టి విద్యను ప్రోత్సహిస్తున్నట్లు ఆమె తెలిపారు. 
ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ఓ చంద్రశేఖర్, డిఇవివో ప్రభాకర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఈ మార్కెట్ లో ఎన్నో ఓటిటి ప్లాట్ ఫామ్స్ వచ్చాయి.. అవి అన్ని నెలనెలా పెమేంట్ చేయాలి.. మన BCN OTT ఫ్లాట్ ఫాం పూర్తిగా ఉచితం... మీరు ఇంట్లో మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ సెల్ ఫోన్ లో అన్ని చానల్స్, రెడియో ఎఫ్ ఎం, న్యూస్ పేపర్, మూవీస్స్ చూడవచ్చును.
BCN OTT
app Download link 
BCN TV LIVE link 

SANA TV LIVE link 
ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 365 రోజులు 24 గంటలు పాటలు వినండి ఓలాసంగా ఆనందంగా ఉండండి.
ELURU FM (All songs)
app DOWNLOAD link