గాజువాక, పశ్చిమ వాహిని, మే 01: ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా గాజువాక ప్రాంతంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో పతాకావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. జీవీఎంసీ 67వ వార్డు పారిశుద్ధ్య కార్మికులు, హైస్కూల్ రోడ్‌లోని నవత మరియు బియ్యంపిఎస్ కార్మికులతో కలిసి మేడే జెండాను ఆవిష్కరించారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు.
తదనంతరం కొత్త గాజువాకలో సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి డాక్టర్ లక్ష్మణస్వామి పాలూరు ఆధ్వర్యంలో ఫ్రూట్ మర్చెంట్స్, కళాశీలతో మేడే కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10:15 గంటలకు జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ రమేష్ కుమార్ అధ్యక్షత వహించారు. కార్మికుల శ్రమ ఫలితంగా సమాజం ముందుకు సాగుతోందని, వారి హక్కులను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు కే.పి. కుమార్, జీవీఎంసీ నాయకులు గొల్ల అప్పారావు, సిఐటియు నాయకులు కే. కిరీటం, సంతోష్ పాల్గొన్నారు. అలాగే గాజువాక హోల్‌సేల్ మర్చంట్ అసోసియేషన్ నాయకులు కర్రీ నాగేశ్వరరావు, తాతబాబు, వీర రాఘవ రెడ్డి, ఆనంద రెడ్డి, రమణ, వెంకట్రావు, బాల వీరారెడ్డి, శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.
సుమారు 60 మంది పండ్లు, కాయగూరల వ్యాపారులు మరియు కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికుల ఐక్యతే వారి శక్తి అని, హక్కుల సాధన కోసం సంఘటితంగా ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు.


