టి నరసాపురం, పశ్చిమ వాహిని, మే 01: ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం, సిఐటియు నాయకులు కలిసి ఎర్రజెండాలను ఆవిష్కరించి కార్మిక హక్కుల కోసం నినదించారు. కార్మికులు, కర్షకులు, చిన్న సన్న రైతుల సమస్యల పరిష్కారానికి ఎర్రజెండా ఎప్పటికీ పోరాడుతుందని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకుడు గూడెం వెంకటరావు మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాపాడేందుకు మేడే ఒక చారిత్రాత్మక దినమని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను బలహీనపరిచే విధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కార్మికుల సంక్షేమం కోసం చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మాణిక్యమ్మ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు విజయలక్ష్మి పాల్గొన్నారు. అలాగే మండల కమిటీ సభ్యులు అనుభవం మురళి, మడకం కుమారి తదితరులు జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, శాఖా కార్యదర్శులు, సిఐటియు మరియు ఇతర ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు.


