తాజా వార్తలు

10/recent/ticker-posts

అభివృద్ధి–సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం: ఎమ్మెల్యే వేగుళ్ళ


మండపేట, పశ్చిమ వాహిని, మే 01: అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని సమానంగా అందించడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం మండపేట పట్టణంలోని 2, 3, 4 వార్డుల్లో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్తగా మంజూరైన పెన్షన్లను పలువురికి అందజేశారు.


ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమాన్ని ముఖ్యంగా పరిగణించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంపు ఫైల్‌పై సంతకం చేయడం ఆయన సంకల్పానికి నిదర్శనమన్నారు. ఎన్నికల హామీ మేరకు పెంచిన పెన్షన్లను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే అందించడం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తోందన్నారు.

ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా లక్షలాది మంది నిరుపేదలకు ఆర్థిక భరోసా కలుగుతోందని తెలిపారు. పేదల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, 2వ వార్డు మాజీ కౌన్సిలర్ చిట్టూరి సతీష్, 3వ వార్డు మాజీ కౌన్సిలర్ యరమాటి గంగరాజు, చుండ్రు అగస్తిరాజు, గుండు తాతరాజు, చుండ్రు రాంబాబు, టేకి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.