తాజా వార్తలు

10/recent/ticker-posts

నిరుపేదలకు వరంగా సీఎం సహాయనిధి – ఎమ్మెల్యే వేగుళ్ళ


మండపేట, పశ్చిమ వాహిని, మే 01: నిరుపేదల ఆరోగ్య అవసరాలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఒక వరంగా నిలుస్తోందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం మండపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ పథకం కింద వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్సలు పొందిన బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేశారు.


ఈ సందర్భంగా మొత్తం 47 మంది లబ్ధిదారులకు సుమారు రూ.24 లక్షల విలువైన ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ఈ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని ఎమ్మెల్యే తెలిపారు. అవసరమైన సమయంలో ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం సహాయనిధిని అందిస్తూ అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ఆర్థిక స్తోమత లేక చికిత్సలు చేయించుకోలేని వారికి ఈ పథకం ద్వారా తక్షణ సహాయం అందుతోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక వార్డులు, గ్రామాల కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పథకం ద్వారా అందిన సహాయానికి లబ్ధిదారులు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.