తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 21: జేగురుపాడు గ్రామంలో జనసేన కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ప్రార్థించారు. గ్రామంలోని దుర్గాదేవి ఆలయంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ పూజల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పూజల అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు రావాలని సంకల్పం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక గ్రామస్తులు కూడా పాల్గొని ఐక్యతను చాటారు.
తదనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగిరెడ్డి రామకృష్ణ, టిడిపి నాయకులు పాతూరి రాజేష్, మారెడ్డి రమేష్, కర్రీ చిన్నబాబు, పాలపర్తి ప్రకాష్, నాగిరెడ్డి కాశి, వీర వెంకట బాలాజీ, నాగిరెడ్డి భాస్కర్, కోల వెంకటేష్, దూడ సుబ్రహ్మణ్యం, వల్లూరి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.



