తాజా వార్తలు

10/recent/ticker-posts

కె. పెదపూడి గ్రామంలో ఘనంగా చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు


డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 21:  నియోజకవర్గం అంబాజీపేట మండలం కె. పెదపూడి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu 76వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమనాధం వీరహనుమంతరావు, కార్యదర్శి పెదపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.


మొదటగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకుంటూ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొని, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పి. గన్నవరం నియోజకవర్గ టీడీపీ కో-కన్వీనర్ దాసరి వి.వి. సత్యనారాయణ, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ బోంతు గంగాధర్ రావు, రాష్ట్ర ఇరిగేషన్ డైరెక్టర్ శిరిగినీడి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. అలాగే టీడీపీ మండల అధ్యక్షుడు గుడాల ఫణి, ప్రధాన కార్యదర్శి రమణం రాము, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు దొమ్మెట్టి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇక ఎన్డీఏ కూటమి నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండుగా ఉండాలని కోరుతూ పాల్గొన్న వారంతా శుభాకాంక్షలు తెలిపారు.