ఏలూరు,పశ్చిమ వాహిని, ఏప్రిల్, 08: సీనియర్ దళిత బహుజన నాయకుడు నేతల రమేష్ బాబు ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకు ఏలూరు కొత్త రోడ్డులోని నవసమాజ్ సొసైటీ కార్యాలయంలో దళిత బహుజన నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రముఖ కవి, రచయిత డాక్టర్ కత్తి పద్మారావు ఆరోగ్యం పై చర్చించారు.
ఈ సందర్భంగా నేతల రమేష్ బాబు మాట్లాడుతూ, బి.ఆర్. అంబేద్కర్ గారి 136వ జయంతి సందర్భంగా డాక్టర్ కత్తి పద్మారావు ని ఏలూరులో ఘనంగా సత్కరించాలని భావించామని తెలిపారు. అయితే, ఆయన తుంటి ఎముకకు గాయమై సికింద్రాబాద్‌లోని యశోదా హాస్పిటల్ లో శస్త్రచికిత్స చేయించుకున్నారని, ప్రస్తుతం హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని వివరించారు.
డాక్టర్ కత్తి పద్మారావు త్వరగా కోలుకుని మళ్లీ తన గళం, తన కలం ద్వారా అణగారిన వర్గాల కోసం పోరాటాన్ని కొనసాగించాలని కోరారు. ఆయన రచనలు కొనుగోలు చేయడం ద్వారా ఆర్థికంగా తోడ్పాటు అందించవచ్చని సూచించారు. అదే సమయంలో ఎవరూ చందాలు సేకరించవద్దని స్పష్టంగా తెలిపారు.
ఈ సమావేశంలో బయ్యారపు వెంకట రమణ, ఆర్. శేషగిరి, దాలయ్య సహదేవుడు, ఫరహాద్ తదితరులు పాల్గొన్నారు.


