తాజా వార్తలు

10/recent/ticker-posts

గ్రామాల నుంచి గిరుల వరకు ఒకే జోష్… ఎంపీ పుట్టినరోజు వేడుకల వెనుక ఏ ప్రత్యేకత?


ఏలూరు జిల్లా, అప్పలరాజుగూడెం/జంగారెడ్డిగూడెం, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 10: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. అప్పలరాజుగూడెం గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పోలవరం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు గన్నిన సురేంద్రనాథ్ చౌదరి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కాటేపల్లి సత్యనారాయణ, తాళ్ల దుర్గారావు, నార్లపాటి రవీంద్ర, పరిమి పుల్లారావు, పవన్, ఆనంద్, నరేంద్ర, చిన్నస్వామి, బొల్లిన దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. నాయకులు ఎంపీపై తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తూ నినాదాలతో కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.


ఇక గోకుల తిరుమల పారిజాతగిరిలో ఎంపీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషంగా నిలిచింది. జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్, జిల్లా ఉపాధ్యక్షుడు రావూరి కృష్ణ, సోసైటీ అధ్యక్షుడు మానికల నాగేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో అభిషేకాలు, అష్టోత్తర పూజలు, వేద ఆశీర్వాదాలతో కార్యక్రమం నిర్వహించారు.

అలయానికి భక్తులు కాలినడకన చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలతో స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఎంపీకి ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. ఆలయ ఈఓ కలగర శ్రీనివాస్ పర్యవేక్షణలో కార్యక్రమం సజావుగా జరిగింది.

జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ వేడుకలు ఎంపీపై ఉన్న ప్రజాభిమానాన్ని ప్రతిబింబించాయి. గ్రామ స్థాయి నుంచి ఆలయ స్థాయి వరకు వివిధ రూపాల్లో జరిగిన ఈ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.