తాజా వార్తలు

10/recent/ticker-posts

శ్రీ నూకాలమ్మ అమ్మవారి సన్నిధిలో డా. రాజాన సత్యనారాయణ (పండు) పుట్టినరోజు వేడుకలు ఘనంగా


జంగారెడ్డిగూడెం, పశ్చిమ వాహిని, మార్చి 15: స్థానిక శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు) పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.


ముందుగా వీరంపాలెం శ్రీ బాలా త్రిపురసుందరీ పీఠం ఆధ్యాత్మిక ప్రతినిధి ఈమని శశికుమార్ శర్మ మరియు భక్తులు శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆశీస్సులతో డాక్టర్ రాజాన సత్యనారాయణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి గంటా పద్మశ్రీ ప్రసాద్ దంపతులు, స్థానిక మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి దంపతులు, మాజీ మున్సిపల్ చైర్మన్ బంగారు శివలక్ష్మి–సూర్యనారాయణ దంపతులు కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు, ఉపాధ్యక్షులు గాలి నూకరాజు, చిట్లూరి సర్వేశ్వరరావు, పోలుపర్తి రాము, చింతకాయల అచ్చిరాజు తదితర ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు మరియు గ్రామ భక్తులు పాల్గొన్నారు. వారు డాక్టర్ రాజాన సత్యనారాయణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు తినిపించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జిల్లా పరిషత్ చైర్మన్ దంపతులు, మున్సిపల్ చైర్మన్ దంపతులు, మాజీ చైర్మన్ దంపతులు మరియు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరుపేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.