తాజా వార్తలు

10/recent/ticker-posts

జిల్లా మొత్తం ఒకే వేడుకలా మారిందా? ఎంపీ బర్త్‌డేకు ఊహించని రెస్పాన్స్!


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 10: ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గ్రామాల నుంచి పట్టణాల వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్ కటింగ్‌లు, అన్నదానాలు, చలివేంద్రాలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈసారి వేడుకలు గతంతో పోలిస్తే మరింత ఉత్సాహంగా, విస్తృతంగా జరిగాయి.


ఏలూరు శాంతినగర్‌లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో అఖిలాంధ్ర దివ్యాంగుల సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దివ్యాంగులు పెద్ద ఎత్తున హాజరై కేక్ కట్ చేసి ఎంపీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ దివ్యాంగుల సంక్షేమానికి చేస్తున్న సేవలను గుర్తుచేసుకున్నారు.

కైకలూరులో జరిగిన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టీడీపీ సీనియర్ నేత బీకేఎం నాని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ పాల్గొన్నారు. వీడియో కాల్ ద్వారా ఎంపీతో మాట్లాడి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన భవిష్యత్తు రాజకీయ ప్రస్థానం మరింత ఉన్నతంగా ఉండాలని ఆకాంక్షించారు.

చింతలపూడిలో ఎమ్మెల్యే రోషన్ కుమార్, భీమడోలులో అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏలూరులో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) తదితరులు పాల్గొని ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఫైర్ స్టేషన్ సెంటర్, పాత బస్టాండ్ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు.

అన్నా క్యాంటీన్లు, పాఠశాలలు, ప్రజా ప్రదేశాల్లో ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ఫ్లెక్సీలు, కేక్ కటింగ్‌లు, అన్నదానాలు, ప్రత్యేక కార్యక్రమాలతో వేడుకలు కోలాహలంగా జరిగాయి. నాయకులు మాట్లాడుతూ పుట్టా మహేష్ కుమార్ జిల్లాలో అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడిగా నిలిచారని కొనియాడారు.