ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 28: ఏలూరు ప్రెస్ ఫోరమ్ నూతన కార్యవర్గ సభ్యులు స్థానిక డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫోరమ్ అధ్యక్షుడు ద్రోణంరాజు వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి పి. రవీంద్ర కుమార్, గౌరవ అధ్యక్షులు పి.వి.ఏ. ప్రసాద్ తదితరులు పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇటీవల నిర్వహించిన ప్రెస్ ఫోరమ్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా జరగడానికి పోలీసు యంత్రాంగం అందించిన సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగిందని కొనియాడారు.
ఈ సమావేశంలో పి.ఆర్.ఓ ఎస్. సంజయ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి రామకృష్ణ రాజు, ఉపాధ్యక్షులు భాగ్యరాజు, సెక్రటరీ వాసు, కార్యవర్గ సభ్యులు హరీష్, ఖుషి రావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రెస్ ఫోరమ్ భవిష్యత్ కార్యకలాపాలు, జర్నలిస్టుల భద్రతపై డీఎస్పీతో చర్చించారు.
జర్నలిస్టులకు అవసరమైన సహాయ సహకారాలు పోలీసు శాఖ తరపున ఎల్లప్పుడూ అందిస్తామని డీఎస్పీ హామీ ఇచ్చినట్లు సభ్యులు తెలిపారు.


