తాజా వార్తలు

10/recent/ticker-posts

ఏలూరు కలెక్టర్‌ను కలిసిన ప్రెస్ ఫోరమ్.. అభివృద్ధికి సహకారం కోరిన కార్యవర్గం


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 28: ఏలూరు ప్రెస్ ఫోరమ్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ద్రోణంరాజు వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి పి. రవీంద్ర కుమార్, గౌరవ అధ్యక్షుడు పి.వి.ఏ. ప్రసాద్, పి.ఆర్.ఓ ఎస్. సంజయ్ తదితరులు కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.


సమావేశంలో ప్రెస్ ఫోరమ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు, జర్నలిస్టుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను కార్యవర్గం వివరించింది. ముఖ్యంగా ఫోరమ్ భవన అభివృద్ధి, జర్నలిస్టులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు జిల్లా యంత్రాంగం సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన పత్రికా రంగం బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం తరపున ప్రెస్ ఫోరమ్ అభివృద్ధికి, జర్నలిస్టుల సంక్షేమానికి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.


అదే విధంగా ప్రెస్ ఫోరమ్ ప్రతినిధులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఫోరమ్ అభివృద్ధికి సహకరించాలని కోరగా, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.