మంగళగిరి, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 29: తెలుగుదేశం పార్టీ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పార్టీ సీనియర్ నేత రెడ్డి సుబ్రహ్మణ్యం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు.
ఈ కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఘనంగా జరిగింది. అదే వేళ జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ పాల్గొని కొత్త బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్టీఆర్ భవన్ ప్రాంగణం మొత్తం పసుపు రంగు అలంకరణలతో కళకళలాడింది. వందలాది మంది నాయకులు పసుపు కండువాలు ధరించి, పార్టీ సిద్ధాంతాలు మరియు ప్రజాసేవకు కట్టుబడి ఉంటామని ప్రమాణం చేశారు.
రాష్ట్ర నలుమూలల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని పండుగలా మార్చారు. ప్రమాణస్వీకారం అనంతరం చంద్రబాబు నాయుడు నూతన కమిటీలకు దిశానిర్దేశం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.


