ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 24: జిల్లాలో పేకాట వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. జంగారెడ్డిగూడెం ఇన్‌స్పెక్టర్ ఎం.వి. సుభాష్ ఆధ్వర్యంలో, తడికలపూడి మహిళా ఎస్‌ఐ వల్లి పద్మకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు జిలకరగూడెం గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అభియోగుల వద్ద నుంచి రూ.5,700 నగదు, 2 సెల్‌ఫోన్లు, 3 స్మార్ట్‌ఫోన్లు, ఒక హీరో గ్లామర్ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట వంటి అక్రమ కార్యకలాపాలు సమాజానికి హానికరమని, వాటిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు తమ పరిసరాల్లో జరిగే చట్ట విరుద్ధ కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు భరోసా ఇచ్చారు.
ఈ దాడుల్లో కానిస్టేబుళ్లు సుధీర్, అజయ్, నాగూర్, చంద్ర మౌళి పాల్గొన్నారు. పోలీసులు నిర్వహించిన ఈ చర్య స్థానికంగా చర్చనీయాంశమైంది.



