తాజా వార్తలు

10/recent/ticker-posts

తిరుమలదేవీపేటలో ఘనంగా నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు


తిరుమలదేవీపేట, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 20: తిరుమలదేవీపేటలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలను రాష్ట్ర కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.


ఈ సందర్భంగా తిరుమలదేవీపేట ఆంజనేయ స్వామి ఆలయంలో ముఖ్యమంత్రి ఆరోగ్యం, ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్థానిక చర్చిలో కూడా ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆయన దీర్ఘాయుష్షు కోరారు. అన్ని మతాల సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విశేష ఆకర్షణగా నిలిచింది.

అనంతరం చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా 76 పండ్ల మొక్కలతో “HBD CBN” ఆకారాన్ని రూపొందించి, హైస్కూల్ మరియు పబ్లిక్ ప్రదేశాల్లో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేకతగా నిలిచింది.

సేవా కార్యక్రమాల భాగంగా తిరుమలదేవీపేటలో ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు. తరువాత పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి అధ్యక్షుడు మధ్యాహ్నపు సురేష్, ప్రధాన కార్యదర్శి రెబ్బ ధర్మారావు, యువ నాయకులు తోట వీర స్వామి నాయుడు, శ్రీను, వైస్ ప్రెసిడెంట్ మన్యం దుర్గారావు, కాసగాని వీరాజు, సీనియర్ నాయకులు యాగంటి వెంకటరావు, సత్యనారాయణ, వీరబాబు, నాగరాజు, అంజి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తోట లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి ఆయన నాయకత్వంలోనే సాధ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు.