తాజా వార్తలు

10/recent/ticker-posts

వీఆర్వో లంచం కేసు – ఏసీబీ దాడిలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు


ఏలూరు జిల్లా, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 15: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం గున్నంపల్లి గ్రామంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సంచలన దాడులు నిర్వహించారు. ఫ్యామిలీ సర్టిఫికెట్ మంజూరు చేయడానికి వీఆర్వో చంద్రలీల రూ.30,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.


బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఉచ్చుపట్టి, లంచం నగదు స్వీకరిస్తున్న సమయంలో చంద్రలీలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ ఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

ప్రజలకు విజ్ఞప్తి:
ప్రభుత్వ సేవల కోసం ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.