తాజా వార్తలు

10/recent/ticker-posts

శ్రీ నూకాలమ్మ దేవస్థానంలో పంచామృతాభిషేకాలు – మే 1న 87వ చండీ హోమం


జంగారెడ్డిగూడెం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 20: శ్రీ నూకాలమ్మ దేవస్థానంలో సోమవారం సందర్భంగా శ్రీ నర్మదా అమృత బాణ లింగేశ్వర స్వామి వారికి ఉచిత పంచామృతాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి ఆధ్యాత్మిక వాతావరణాన్ని అలరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజల్లో పాల్గొన్నారు.


ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు), ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దేవస్థాన అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ కళ్యాణ కళా వేదిక వద్ద నిర్వహించిన ఈ పూజలను ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ బృందం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు మాట్లాడుతూ ప్రతి సోమవారం శ్రీ నర్మదా అమృత బాణ లింగేశ్వర స్వామి వారికి, ప్రతి శుక్రవారం అమ్మవారి ఉత్సవమూర్తికి ఉచిత పంచామృతాభిషేకాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అభిషేకాల్లో పాల్గొనదలచిన భక్తులు ఆలయ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకుంటే గోత్రనామార్చనతో పూజలు చేయించుకునే అవకాశం ఉందని వివరించారు.

రాబోయే మే 1, 2026 శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి 87వ చండీ హోమాన్ని లోకకల్యాణార్థం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ హోమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని భక్తులకు పిలుపునిచ్చారు.

ఇక భక్తులు సమర్పించిన వెండితో అమ్మవారికి అర్ధభాగం వెండి చీరను తయారు చేసి ఉగాది సందర్భంగా అలంకరించినట్లు తెలిపారు. మిగిలిన భాగం పూర్తి చేయడానికి భక్తులు వెండి లేదా నగదు రూపంలో సహాయం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జగదీష్, జీ వీ కే ఎస్ రాజు, సేవా బృందాల సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.