తాజా వార్తలు

10/recent/ticker-posts

టి. నర్సాపురంలో ఘనంగా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు


టి. నర్సాపురం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 20: మెయిన్ సెంటర్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


వేడుకల అనంతరం మహిళలకు, పేదలకు వస్త్రాలను పంపిణీ చేసి సేవా కార్యక్రమాలను చేపట్టారు. అలాగే ఇటీవల రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కొండపల్లి రవిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు చంద్రబాబు నాయుడు సేవలను కొనియాడుతూ ప్రసంగించారు.

తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నాయుడు రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. ఆయన దూరదృష్టి వల్లే అమరావతి నిర్మాణం, పోలవరం వంటి ప్రాజెక్టులు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. మాజీ జడ్పిటిసి సభ్యులు నల్లూరి చలపతి రావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బడుగుల పార్టీగా ప్రజల కోసం పనిచేస్తోందన్నారు.

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కొండపల్లి రవి మాట్లాడుతూ సామాన్యుడైన తనకు ఇంతటి పదవి ఇవ్వడం పార్టీ గొప్పతనమని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తుకు వెలుగునిచ్చేది తెలుగుదేశం పార్టీయేనని విశ్వాసం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అడపా నాగరాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో పిన్నమనేని మధు, జగ్గవరం సొసైటీ అధ్యక్షుడు బొంతు సత్యనారాయణ, అల్లంచర్ల సర్పంచ్ నార్ని వెంకటరావు, పాలేటి సత్యనారాయణ, పబ్బు జయరాజు, పెద్దిన సత్యనారాయణ, కోరుకొండ వెంకటభద్రం, గద్దల శీను తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.