తాజా వార్తలు

10/recent/ticker-posts

నర్సిపూడిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం


ఆలమూరు మండలం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 14: నర్సిపూడి పిఏసిఎస్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధ్యక్షుడు రాయుడు వెంకటస్వామి (బాబ్జి) ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు దున్నే స్వామి నాయుడు, ఉన్నమట్ల బాలాజీ పాల్గొని కేంద్రాన్ని ప్రారంభించి రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. సొసైటీ ద్వారా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తామని, రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి తమ పంటను కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.

రైతులు ఏవైనా సందేహాలు ఉంటే విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్‌ను సంప్రదించాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను పూర్తిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి. మీనా, కందిబొట్లు బాలాజీ, గుత్తుల శ్రీరాములు, చాముకూరి శ్రీను, దొమ్మేటి ప్రసాద్, చలపతి రమణ, సొసైటీ సీఈవో, విఏఏలు, పంచాయతీ కార్యదర్శి, రైతులు తదితరులు పాల్గొన్నారు.