తాజా వార్తలు

10/recent/ticker-posts

ద్వారకాతిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్


ఏలూరు/ద్వారకాతిరుమల, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 21: ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ద్వారకాతిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు సంప్రదాయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.


ఆలయ ఈఓ భద్రాజీ మరియు ఇతర అధికారులు స్వాగతం పలకగా, వేద పండితులు అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదాశీర్వచన మండపంలో చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు వేదాశీర్వచనం అందించారు. కార్యక్రమం అనంతరం ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ బి. అనిల్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ కూచిపూడి ఉదయభాస్కరరావు, అధికారులు ఊర్మిళాదేవి, అర్జునరావు, ఇఇ యం. నారాయణ స్వామి, డిఇఇ కె. సతీష్ కుమార్, ఏఎంసీ చైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు, సంయుక్త కమిషనర్, ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు, జిల్లా పరిషత్ సీఈఓ పి. జగదాంబ, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి జి. త్రినాధబాబు తదితరులు పాల్గొన్నారు.