ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 5: బాబు జగజీవన్ రామ్ గొప్ప సంఘ సంస్కర్త అని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. ఆయన 118వ జయంతి సందర్భంగా ఏలూరు కలెక్టరేట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి డా. బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, పేద మరియు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి అపారమని పేర్కొన్నారు.
డా. బాబు జగజ్జీవన్ రామ్ విలువలతో కూడిన రాజకీయ జీవితం గడిపిన మహానేత అని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని కలెక్టర్ అన్నారు. సమాజంలో అంటరానితనం, కులవివక్ష నిర్మూలన కోసం ఆయన నిరంతరం పోరాడారని గుర్తుచేశారు.
అలాగే ఆయన చేసిన సేవలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆయన స్ఫూర్తితో యువత సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి, షెడ్యూల్డ్ కులాల సంఘాల నాయకులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.


