తాజా వార్తలు

10/recent/ticker-posts

సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఏలూరులో సేవా కార్యక్రమాలు


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 20: పేదల ఉపాధి భద్రతకు అవసరమైన సహాయాన్ని అందించడంలో తాము ఎల్లప్పుడూ ముందుంటామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఏలూరు నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.


ఈ సందర్భంగా పవర్‌పేటలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో పేదలకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులకు ట్రైసైకిళ్లు అందజేసి వారికి ఆర్థికంగా, సామాజికంగా భరోసా కల్పించారు. రైస్ మిల్లర్ దివ్వెల జయబాబు సహకారంతో ఒకరికి రూ.10,000 ఆర్థిక సాయం కూడా అందించారు.

సీఎం పుట్టినరోజు సందర్భంగా ఏలూరు నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. కేక్ కటింగ్‌లు, అన్నదాన కార్యక్రమాలు, చలివేంద్రాల ఏర్పాటు, పేదలకు అవసరమైన వస్తువుల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యం వహించారు.

ఈ కార్యక్రమంలో ఎఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శి రెడ్డి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.