తాజా వార్తలు

10/recent/ticker-posts

జనగణన-2027: ‘స్వీయ గణన’పై అవగాహన పెంచండి – కలెక్టర్ ఆదేశం


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 15: జిల్లాలో జనగణన-2027 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ మరియు ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి కె. వెట్రిసెల్వి అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ నుండి టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈనెల 16 నుండి 30వ తేదీ వరకు ‘స్వీయ గణన’ (Self-enumeration) నమోదు కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.


ఈ ఏడాది ప్రత్యేకంగా [https://se.census.gov.in](https://se.census.gov.in) పోర్టల్ ద్వారా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించబడిందని తెలిపారు. మే 1 నుండి 30 వరకు ఇండ్ల జాబితా మరియు గణన జరుగనున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరారు.

స్వర్ణ గ్రామం/వార్డ్ సిబ్బంది రోజుకు కనీసం 10–20 మంది ‘స్వీయ గణన’ నమోదు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రముఖుల ద్వారా నమోదు చేయించి, దాన్ని మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ నమోదు పూర్తిగా స్వచ్ఛందమని, ఎవరిపైనా బలవంతం చేయరాదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ దేవకీదేవి, సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.


భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు – కలెక్టర్ వెల్లడి

జిల్లాలో భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.

భీమా పథకంలో నమోదైన కార్మికులకు:
* వివాహ కానుక: ₹20,000
* ప్రసూతి ప్రయోజనం: ₹20,000
* సహజ మరణం: ₹60,000
* అంత్యక్రియలు: ₹20,000
అందించబడుతున్నాయని చెప్పారు.

18 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల భవన నిర్మాణ కార్మికులు ఈ పథకానికి అర్హులని, సమీప కార్మిక శాఖ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఒకసారి మాత్రమే ₹50 రిజిస్ట్రేషన్ ఫీజు, సంవత్సరానికి కేవలం ₹12 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు సమీప కార్మిక శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.