ఏలూరు జిల్లా, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 08: ‘నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామంలో ఉన్న యర్ర చెరువును ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా చెరువు ప్రస్తుత పరిస్థితి, నీటి నిల్వ సామర్థ్యం, గ్రామానికి కలిగే ప్రయోజనాలపై ఎమ్మెల్యే అధికారులు తో సమీక్షించారు. చెరువు అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, ప్రభుత్వ అధికారులు, బీజేపీ నాయకులు, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


