బుట్టాయిగూడెం, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 08: బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పి. చెన్నారావు బుధవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, పి. చెన్నారావు కొత్త బాధ్యతల్లో విజయవంతం కావాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ న్యాయం, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తూ విధులు నిర్వర్తించాలని సూచించారు.
పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెంపొందించే విధంగా పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. కొత్త బాధ్యతల్లో ఉత్తమ సేవలు అందించాలని ఎమ్మెల్యే ఆశీర్వదించారు.


