తాజా వార్తలు

10/recent/ticker-posts

పెట్రోల్ బంకులపై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు – ఆందోళన అవసరం లేదు


చింతలపూడి, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 27: పట్టణంలో పెట్రోల్ బంకుల వద్ద ఏర్పడిన రద్దీ నేపథ్యంలో సోమవారం శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్వయంగా బంకులను సందర్శించి పరిస్థితిని పరిశీలించిన ఆయన, బంకు యాజమాన్యంతో పాటు వాహనదారులతో మాట్లాడారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెట్రోల్ మరియు డీజిల్ కొరత ఉందనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆసుపత్రులు మరియు ఇతర అత్యవసర అవసరాల కోసం వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బంకుల్లో తగిన స్థాయిలో ఇంధన నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి సూచించారు.

అలాగే సరఫరా నిరంతరంగా కొనసాగించి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రజలు కూడా అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని, వేసవి కాలంలో అధిక నిల్వలు అగ్ని ప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

కృత్రిమ కొరత సృష్టించే వారు, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ మరియు పోలీసు శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.