తాజా వార్తలు

10/recent/ticker-posts

దివంగత పోలీసు సిబ్బంది కుటుంబానికి ఆర్థిక సహాయం


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 27: చాట్రాయి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తూ అనారోగ్య కారణాలతో ఏప్రిల్ 2న మరణించిన వి. మాధవ రెడ్డి కుటుంబానికి ఏలూరు జిల్లా పోలీసులు ఆర్థిక సహాయం అందించారు.


ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ వారు సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని తన కార్యాలయంలో మాధవ రెడ్డి గారి భార్య సుజాతకు ఫ్లాగ్ ఫండ్ ద్వారా ₹25,000 చెక్కు, విడో ఫండ్ ద్వారా ₹50,000 చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, దివంగత మాధవ రెడ్డి పోలీస్ శాఖకు చేసిన సేవలు అమూల్యమని, ఆయన మరణం శాఖకు తీరని లోటని అన్నారు. ప్రభుత్వం నుంచి రావలసిన అన్ని రాయితీలు త్వరగా అందేలా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకానికి సిఫారసులు చేస్తానని తెలిపారు.

కుటుంబానికి ఎలాంటి అవసరం వచ్చినా నేరుగా తనను సంప్రదించవచ్చని ఎస్పీ భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బి సెక్షన్ సూపరింటెండెంట్ పి. నాగేశ్వరరావు మరియు పోలీస్ ప్రధాన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.