తాజా వార్తలు

10/recent/ticker-posts

సంధిపూడిలో శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట ఘనంగా – పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి


ఆలమూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 21: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం సంధిపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారాముల వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తి వాతావరణం నెలకొంది. వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన ప్రతిష్ట కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు.

కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు చిర్ల జగ్గిరెడ్డిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆయన అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.