తాజా వార్తలు

10/recent/ticker-posts

కొత్తపేట–వానపల్లిలో అంబేద్కర్ జయంతి


కొత్తపేట /వానపల్లి, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 14: ప్రాంతాల్లో బీజేపీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కోటిపల్లి దామోదర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కొత్తపేటలోని పలు ప్రదేశాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.


అనంతరం వానపల్లి గాంధీనగర్‌లో జరిగిన సమావేశంలో ప్రముఖ దళిత నాయకుడు ఉండ్రాజవరపు సత్యనారాయణ అంబేద్కర్ జీవిత విశేషాలను వివరించారు. అస్పృశ్యత, అంటరానితనం నిర్మూలన కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తుచేస్తూ, నేటి సమాజం అనుభవిస్తున్న హక్కులు, రిజర్వేషన్లు అన్నీ ఆయన రచించిన రాజ్యాంగ ఫలితమేనని అన్నారు.

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలోని NDA అంబేద్కర్ ఆలోచనలను గౌరవిస్తూ ముందుకు సాగుతోందని, మహిళలకు 33% రిజర్వేషన్ వంటి నిర్ణయాలు ఆయన ఆశయాల సాధనకు ఉదాహరణలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు బళ్ల మూలాస్వామి, యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి పాలూరి జయప్రకాశ్ నారాయణ, సీనియర్ నాయకులు కోటిపల్లి సుబ్రహ్మణ్యం, కోటిపల్లి రఘురాం వేణుగోపాల్, మైనారిటీ మోర్చా నాయకులు అజ్జరపు సత్యనారాయణ, కంచుస్తంభం సతీష్, తరిట్ల శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.