తాజా వార్తలు

10/recent/ticker-posts

ఏపీలో పాస్టర్ ఇంట్లో సూట్ కేసుల నిండా నోట్ల కట్టలు ...


పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, పశ్చిమ వాహిని, 17: ఓ పాస్టర్ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో పాస్టర్ ఇంట్లో సూట్ కేసుల నిండా నగదు స్వాధీనం చేసుకున్నారు. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరానికి చెందిన పాస్టర్ ఘంటా జాన్ ఇంట్లో శుక్రవారం ( ఏప్రిల్ 17 ) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పోలీసులు.ఈ తనిఖీల్లో రూ. 2 కోట్ల 27 లక్షల 94 వేలు నగదు సీజ్ చేసినట్లు తెలిపారు పోలీసులు.


పాస్టర్ జాన్ అల్లుడు శాంసన్ హైదరాబాద్ నుంచి నరసాపురానికి అక్రమంగా రూ. 50 లక్షలు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో రంగంలోకి దిగారు పోలీసులు. శాంసన్ ఇంటికి చేరుకోగానే ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పోలీసులు. శాంసన్ దగ్గరి నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. ఈ క్రమంలో పాస్టర్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించి మరింత నగదు స్వాధీనం చేసుకున్నామని..పాస్టర్ జాన్ కుటుంబంపై కేసు నమోదు చేసి దర్యాప్తున్నట్లు తెలిపారు పోలీసులు. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది..? ఎలా వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

పాస్టర్ అల్లుడు శాంసన్ హైదరాబాద్ నుంచి వస్తున్నాడని సమాచారం అందగానే నిఘా పెట్టమని.. అతడు ఇంటికి చేరుకోగానే సోదాలు నిర్వహించామని తెలిపారు. శాంసన్ దగ్గర రూ. 50 లక్షలు స్వాధీనం చేసుకున్నామని.. సరైన వివరాలు ఇవ్వకపోవడంతో.. పాస్టర్ జాన్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించామని తెలిపారు పోలీసులు. ఈ తనిఖీల్లో పాస్టర్ ఇంట్లో మూడు సూట్ కేసుల్లో  రూ. 2 కోట్ల 27 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.