తాజా వార్తలు

10/recent/ticker-posts

పెదపాడు గ్రంథాలయంలో ఉచిత సమ్మర్ క్యాంప్


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 25: పెదపాడు శాఖా గ్రంథాలయంలో ఈనెల 28వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు ఉచిత వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఈ శిబిరాలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు.


ఈ సమ్మర్ క్యాంప్‌లో విద్యార్థులకు బాల సాహిత్యం, కథలు వినడం-చెప్పడం, పుస్తక సమీక్ష, చిత్రలేఖనం వంటి సృజనాత్మక కార్యక్రమాలతో పాటు చదరంగం, క్యారం, క్విజ్, జనరల్ నాలెడ్జ్ వంటి అంశాలపై శిక్షణ అందిస్తారు. అదనంగా యోగ, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం వంటి అంశాలను కూడా బోధించనున్నారు.

ఈ శిబిరం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా శక్తి, వ్యక్తిత్వ వికాసం పెంపొందించడమే లక్ష్యమని గ్రంథాలయ అధికారులు తెలిపారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా ఈ శిబిరాలకు పంపించి మంచి విజ్ఞానవంతులు, ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని గ్రంథాలయ అధికారి విజ్ఞప్తి చేశారు.