ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 25: ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఏపీ బీజేఏ) ఎలక్ట్రానిక్ మీడియా ఏలూరు జిల్లా జాయింట్ సెక్రటరీగా వి. పెద్దిరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ద్వారకాతిరుమల ప్రైమ్ 9 ఛానల్‌లో పనిచేస్తున్న ఆయనను శనివారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఏలూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) మరియు ఏపీ బీజేఏ జిల్లా కమిటీ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలశౌరి చేతుల మీదుగా జిల్లా అధ్యక్షులు పి. నారాయణరావు అధ్యక్షతన పెద్దిరాజుకు నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పెద్దిరాజు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల హక్కుల సాధనకు కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు.
ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు జబీర్, కార్యదర్శి హరీష్ మాట్లాడుతూ పెద్దిరాజు నియామకంతో కమిటీ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. యువ జర్నలిస్టులకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని అభిప్రాయపడ్డారు. ముఖ్య అతిథి బాలశౌరి జర్నలిస్టులు ఐక్యంగా ఉండి తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ బీజేఏ జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ, సీనియర్ పాత్రికేయులు సోమశేఖర్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, పలు ఛానళ్ల జర్నలిస్టులు పాల్గొని పెద్దిరాజును అభినందించారు.


