తాజా వార్తలు

10/recent/ticker-posts

శుక్రవారం ‘అమ్మవారి మహిమ’… భక్తుల రద్దీ ఎందుకు పెరిగింది?


జంగారెడ్డిగూడెం, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 10: శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న ఇలవేల్పు దేవత శ్రీ నూకాంబిక అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.


ఈ సందర్భంగా ఆలయ కళ్యాణ వేదిక వద్ద ఉత్సవ మూర్తికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. మూలవిరాట్టుకు ఏకాదశ సాయంసంధ్య హారతి పూజలను ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ బృందం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు) మాట్లాడుతూ అమ్మవారి సేవలో భాగంగా దాతలు విరాళాలు సమర్పించారని తెలిపారు. కే.వి. రమణ కుటుంబ సభ్యులు రూ.10,116 విరాళం అందించగా, బుర్ల గాంధి రత్నకుమారి కుటుంబం 20 గ్రాముల వెండి పట్టీలు సమర్పించారు. ఈ విరాళాలతో అమ్మవారి వెండి చీర తయారీ చేపట్టనున్నట్లు తెలిపారు.

అలాగే భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో పులిహోర పంపిణీ చేయగా, నాగరాజు వర్మ కుటుంబ సహకారంతో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలు భక్తులకు ఉపశమనం కలిగించాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు, ఉపాధ్యక్షులు గాలి నూకరాజు, రొంగల పుల్లయ్య, కంచర్ల నాగేశ్వరరావు, జి.వి.కె.ఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘాలు, సేవా బృందాలు, గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.