తాజా వార్తలు

10/recent/ticker-posts

భీమడోలులో గోవధ అడ్డగింత.. గోమాత రక్షణకు బీజేపీ నాయకుల ఆవేదన


భీమడోలు, ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 21: భీమడోలు సంతమార్కెట్ సమీపంలో గోవధకు యత్నం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో బీజేపీ నాయకులు వెంటనే స్పందించి ఆవు, ఆవుదూడను రక్షించారు.


మంగళవారం ఘటనాస్థలానికి చేరుకున్న బీజేపీ నాయకులు, కత్తితో కోయడానికి సిద్ధంగా అచేతన స్థితిలో ఉన్న ఆవు, ఆవుదూడను గమనించి వెంటనే దుండగుల నుంచి వాటిని కాపాడి గోశాలకు తరలించే ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు ప్రవీణ్ పటేల్ మాట్లాడుతూ, “తమ ప్రాణాలు పోయినా పర్లేదు కానీ గోవధను సహించమని” తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గోవధపై నిషేధం ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని పేర్కొన్నారు.

అధికారులు ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి చర్యలకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పోలీసులు అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు.

తవ్వా చినబాబు మాట్లాడుతూ, హిందువుల ఆచారాల్లో గోమాతకు ప్రత్యేక స్థానం ఉందని, అలాంటి ఆవులను వధించడం భావోద్వేగాలకు భంగం కలిగిస్తుందని తెలిపారు. ఈ ఘటనపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.