ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 15: ఏలూరు జిల్లాలోని 27 మండలాల పరిధిలో ఉన్న మొత్తం 543 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటరు జాబితాలను బుధవారం విడుదల చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి కె. అనురాధ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం, 1994లోని నిబంధనలు (పరిచ్ఛేదాలు 11, 12) మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ నెం.25/SEC-B2/2026 (తేదీలు: 06.02.2026, 25.03.2026) ప్రకారం ఈ ఓటరు జాబితాలను ప్రచురించినట్లు పేర్కొన్నారు.
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పాటు ప్రజలు ఎక్కువగా రాకపోకలు ఉండే ప్రదేశాల్లో ఈ జాబితాలను ప్రదర్శనకు ఉంచినట్లు తెలిపారు.
ప్రజలకు సూచన:
తమ పేర్లు ఓటరు జాబితాలో సరిగా ఉన్నాయో లేదో ప్రజలు పరిశీలించుకోవాలని, ఎలాంటి తప్పులు లేదా అభ్యంతరాలు ఉన్నా సంబంధిత అధికారులకు తెలియజేయాలని అధికారులు సూచించారు.


