తాజా వార్తలు

10/recent/ticker-posts

పోలీస్ శాఖలో ఎస్సై పదోన్నతుల పరీక్షలకు భారీ ఏర్పాట్లు


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 06: ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి మరియు కృష్ణా జిల్లాల్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ (HC), ఏఎస్ఐ (ASI)లకు ఎస్సై (SI) పదోన్నతుల కోసం నిర్వహించే ప్రీ-ప్రమోషనల్ క్వాలిఫైయింగ్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేపట్టారు.


ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్, ఐపీఎస్ మరియు ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆధ్వర్యంలో 06-04-2026న ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలోని హెచ్‌జె దొర సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

👉 ఈ సందర్భంగా ఐజీ గారు మాట్లాడుతూ, ఏలూరు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఏప్రిల్ 7 మరియు 8 తేదీలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
👉 మూడు ఉమ్మడి జిల్లాల నుండి మొత్తం 134 మంది పురుష మరియు మహిళా అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వెల్లడించారు.
👉 పరీక్షలు పూర్తిగా నిష్పక్షపాతంగా, ఎటువంటి మాలప్రాక్టీస్‌కు తావులేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
👉 అభ్యర్థులకు జంబ్లింగ్ విధానంలో సీటింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
👉 సిబ్బంది విధుల్లో ఎదురయ్యే అంశాలు, చట్టపరమైన విషయాలపై ప్రశ్నలు ఉండనున్నాయని చెప్పారు.

👉 పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన ముఖ్య సూచనలు:
* పరీక్షా కేంద్రం వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు
* నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం
* అభ్యర్థులు, సిబ్బంది సమయానికి హాజరు కావడం

ఈ సమావేశంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ శ్రీమతి సుస్మిత ఐపీఎస్, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, క్లూస్ టీమ్స్, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.