జంగారెడ్డిగూడెం, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 06: పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో సోమవారం సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో శ్రీ నర్మదా అమృత బాణ లింగేశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకాలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు), ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి.
ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు మాట్లాడుతూ, ఆలయ కళ్యాణ కళా వేదిక వద్ద శ్రీ నర్మదా అమృత బాణ లింగేశ్వర స్వామి వారి పంచలోహ ఉత్సవ లింగానికి పంచామృతాభిషేకాలను అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ నిర్వహించారని తెలిపారు.
భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి అభిషేకాలలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులు వెండి రూపంలో, నగదు రూపంలో విరాళాలు సమర్పించడంతో పాటు, పాత వెండి వస్తువులను అమ్మవారి వెండి చీర తయారీకి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పోలుపర్తి రాము, చింతకాయల అచ్చిరాజు, హనుమంతరావు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు మరియు భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


