తాజా వార్తలు

10/recent/ticker-posts

అక్కంపేటలో అంబేద్కర్ జయంతి వేడుకలు.. సీనియర్ జర్నలిస్ట్ కె.ఎస్. శంకరరావుకు సత్కారం


జంగారెడ్డిగూడెం రూరల్, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 14: మండలం అక్కంపేట గ్రామంలో భారత రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ జర్నలిస్ట్, మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు కె.ఎస్. శంకరరావును గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. మండల టిడిపి ఉపాధ్యక్షులు గొల్లమందల శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.


ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ అంబేద్కర్ గారు సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు. ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించి ముందుకు సాగాలని ఆయన ఇచ్చిన సందేశం నేటికీ ప్రాసంగికమని గుర్తు చేశారు.

సన్మాన గ్రహీత శంకరరావు మాట్లాడుతూ యువత మంచి ఆలోచనతో, విద్యతో, సంస్కారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లపై ఆధారపడకుండా తమ ప్రతిభతో ఎదగాలని సూచిస్తూ, తల్లిదండ్రులు పిల్లలకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వాలని అన్నారు. గ్రామ అభివృద్ధికి జర్నలిస్ట్‌గా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ‘అనన్య’ చిత్రం దర్శకుడు బి. ప్రసాద్ రాజు, అక్కంపేట ప్రాథమిక పాఠశాల ఏఎంసీ చైర్మన్ కాజా వెంకటేశ్వరరావు, పిఎసిఎస్ చైర్మన్ గంధం గోపాలకృష్ణ, నీటి సంఘం అధ్యక్షుడు ఆకుల సుబ్రహ్మణ్యం, అంబేద్కర్ వాది తోమ్మండ్రు వెంకటేశ్వరరావు, జనసేన నాయకుడు తారిపరెడ్డి నాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.