ఆంధ్ర ప్రదేశ్,కృష్ణా జిల్లా/ఎన్టీఆర్ జిల్లా, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో, చైర్మన్ మహమ్మద్ ఫరూఖ్ షుబ్లీ సారథ్యంలో “ఉచిత కోచింగ్ క్యాంప్ – ఆవో ఉర్దూ సీఖే” కార్యక్రమం మే 1 నుంచి మే 23 వరకు నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మొగల్‌రాజ్‌పురంలోని క్యాంపు కార్యాలయంలో చైర్మన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, మైనారిటీ & న్యాయశాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. “ఆవో ఉర్దూ సీఖే” అంటే “రండి ఉర్దూ నేర్చుకుందాం” అనే భావంతో అందరికీ ఉపయోగపడేలా ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఉర్దూ భాషను అందరూ నేర్చుకోవాల్సిన భాషగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఉర్దూ అకాడమీ లిటరరీ కమిటీ రూపొందించిన “రండి ఉర్దూ నేర్చుకుందాం” పుస్తకాన్ని త్వరలో మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ మహమ్మద్ గౌస్ పీర్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, ఉర్దూ ప్రేమికులు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై మద్దతు తెలిపారు.

.jpeg)

