తాజా వార్తలు

10/recent/ticker-posts

చింతలపూడి విద్యుత్ శాఖలో అక్రమాల ఆరోపణలు – అదనపు వసూళ్లపై విచారణకు డిమాండ్


చింతలపూడి, పశ్చిమవాహిని, మార్చి 08: పట్టణంలో విద్యుత్ శాఖలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటి సర్వీసుల నుంచి కమర్షియల్ సర్వీసుల వరకు వినియోగదారుల నుంచి అదనపు మొత్తాలను వసూలు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.


పట్టణంలోని ఒక ప్రముఖ వ్యక్తికి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ సర్వీసులు ఇవ్వడానికి రెండున్నర లక్షల రూపాయలకుపైగా వసూలు చేసినట్లు సమాచారం. అయితే వాస్తవానికి విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన మొత్తం రూ.30 వేల లోపే ఉంటుందని తెలిసింది.

అలాగే కాలిపోయిన మీటర్లను మార్చడానికి కూడా వినియోగదారుల నుంచి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారని, ఈ మొత్తాలను అధికారికంగా శాఖకు చెల్లించకుండా దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

విద్యుత్ సర్వీసుల మంజూరులో కూడా నియమ నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చింతలపూడిలో ఒక ఉద్యోగి ఇలాంటి అక్రమాలకు పాల్పడటానికి ఒక కీలక అధికారి అండదండలే కారణమని కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ విషయంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యుత్ శాఖలో జరుగుతున్న అక్రమ వసూళ్లను వెంటనే నియంత్రించాలని చింతలపూడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.