తాజా వార్తలు

10/recent/ticker-posts

రంజాన్ సందర్భంగా కొయ్యలగూడెం జామియా మస్జిద్‌లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు


కొయ్యలగూడెం, పశ్చిమవాహిని, మార్చి 16: రంజాన్ పండుగ సందర్భంగా కొయ్యలగూడెం పట్టణంలోని జామియా మసీదు కొయ్యలగూడెం లో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మస్జిద్‌కు చేరుకున్న ఎమ్మెల్యేకు ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముస్లిం మత పెద్దలు మరియు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ పండుగ ముస్లిం సోదరులకే కాకుండా సమాజం మొత్తానికి శాంతి, సహనం, సహనశీలతను నేర్పే పవిత్రమైన పండుగ అని అన్నారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, దానం వంటి మంచి సంప్రదాయాల ద్వారా మనిషిలోని మానవత్వాన్ని పెంపొందించే మహత్తరమైన పండుగ రంజాన్ అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో అన్ని మతాల ప్రజలు సౌహార్ద వాతావరణంలో జీవించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అన్ని మతాలను సమానంగా గౌరవించడం భారతీయ సంస్కృతి గొప్పతనం అని పేర్కొంటూ మత సామరస్యాన్ని కాపాడుతూ ప్రజలు అందరూ ఐక్యంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. రంజాన్ నెలలో ఉపవాసం పాటిస్తున్న ప్రతి ముస్లిం సోదరుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబాలకు సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తోట రవి, కొయ్యలగూడెం సొసైటీ అధ్యక్షుడు దుగ్గిన శ్రీనివాస్, టౌన్ అధ్యక్షుడు బాదేపల్లి శ్రీనివాస్, సొసైటీ డైరెక్టర్లు స్వాతి, జట్ల సత్యనారాయణ, మేడిన కన్నయ్య, అడపా శ్రీను, ముస్లిం మత పెద్దలు, కూటమి నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.